తెలిసి ఏ తప్పు చేయలేదు: సెల్ఫీ వీడియో విడుదల చేసిన ప్రముఖ జానపద గాయని మంగ్లీ

  • బర్త్ డే పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్ మాదిరిగా జరుపుకున్నామన్న మంగ్లీ
  • లిక్కర్, సౌండ్ సిస్టమ్‌కు అనుమతి తీసుకోవాలన్న విషయంపై అవగాహన లేదన్న మంగ్లీ
  • అధారాలు లేని అభియోగాలు తనపై మోపొద్దంటూ మంగ్లీ వినతి
ప్రముఖ జానపద గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో అర్ధరాత్రి జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి ముందస్తు అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై మంగ్లీతో సహా మరికొందరిపై కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది.

ఈ ఘటనపై స్పందిస్తూ సింగర్ మంగ్లీ నిన్న రాత్రి సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది. తెలియకుండా జరిగిన పొరపాటుగా ఆమె పేర్కొంది.

నా పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మానాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు కూడా ఉన్నారు. మద్యం, సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. మద్యం, సౌండ్ సిస్టమ్‌కు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అవగాహన లేదు. ఎవరైనా చెప్పి ఉంటే అనుమతి తీసుకునేదాన్ని. రిసార్ట్‌లో పార్టీ అనుకోకుండా సడన్‌గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునేదాన్ని. అనుమతి తీసుకోవాలనే విషయం నాకు ఎవరూ చెప్పలేదు. తెలిసి అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు. 

రిసార్ట్‌లో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు, వాడలేదు. పోలీసులు సెర్చ్ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. గంజాయి తాగినట్టు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో ఎప్పుడో తీసుకున్నట్టు తేలిందని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. మేం కూడా పోలీసులకు సహకరిస్తున్నాం. నాకు తెలిసి ఎందుకు ఇలా చేస్తాను. మా అమ్మా, నాన్నలను దగ్గర పెట్టుకొని ఇలాంటివి ప్రోత్సహిస్తానా? ఒక రోల్‌ మోడల్‌గా ఉండాలనుకుంటాను కానీ, ఇలాంటివి ఎందుకు చేస్తాను. మీడియా మిత్రులకు నా విన్నపం.. దయచేసి ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు.. ప్లీజ్‌’ అంటూ మంగ్లీ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. 


More Telugu News