Tourist Family: 8 కోట్లతో సినిమా .. 80 కోట్లకి పైగా వసూళ్లు!

Tourist Family Movie Update
  • మలయాళ సినిమాల దారిలో తమిళ కథలు 
  • తక్కువ బడ్జెట్లో రూపొందిన 'టూరిస్ట్ ఫ్యామిలీ'
  • భారీ లాభాలతో దూసుకుపోతున్న సినిమా 
  • ఆలోచింపజేస్తున్న సందేశం

 మలయాళంలో క్రితం ఏడాది ఆరంభంలో వచ్చిన 'ప్రేమలు' .. 'మంజుమ్మేల్ బాయ్స్' .. 'భ్రమయుగం' సినిమాలు వెంటవెంటనే భారీ విజయాలను అందించాయి. తక్కువ బడ్జెట్ తో 'ప్రేమలు' .. 'మంజుమ్మేల్ బాయ్స్' సినిమాలు రికార్డులను సృష్టిస్తే, తక్కువ పాత్రలతో 'భ్రమయుగం' సంచలనం సృష్టించింది. ఈ ఏడాది కూడా మళయాలంలో అదే జోరు కొనసాగుతూ ఉండటం విశేషం. 
 
ఈ నేపథ్యంలో తమిళ సినిమాలు కూడా ఇదే తరహా కంటెంట్ ను అందించడానికి ఉత్సాహాన్ని కనబరుస్తున్నాయి. ఆ జాబితాలో మనకి 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఒకటిగా కనిపిస్తోంది. శశికుమార్ .. సిమ్రన్ .. యోగిబాబు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. కేవలం 8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 80 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. 

అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథలో, శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడటంతో ధర్మదాసు ఫ్యామిలీ బ్రతకడం కోసం భారత్ లోకి ప్రవేశిస్తుంది. తాము ఎక్కడి నుంచి వచ్చింది బయటికి చెప్పకుండా, చుట్టుపక్కలవారి నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని కష్టాలు పడిందనేది కథ. వినోదం - సందేశం కలిసి నడిచే ఈ సినిమా ప్రముఖుల ప్రశంసలను అందుకున్న సంగతి తెలిసిందే.
Tourist Family
Sasikumar
Simran
Yogi Babu
Tamil Cinema
Kollywood
Sri Lanka economic crisis
Abhishek Jeevanth
Box Office Collection
Tamil movie review

More Telugu News