ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్!

  • దిలీప్ హీరోగా 'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ'
  • 26 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిన మలయాళ మూవీ 
  • మే 9న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ నెల 20 నుంచి జీ 5లో స్ట్రీమింగ్  

క్రితం ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మలయాళం మంచి హిట్స్ తో దూసుకెళుతోంది. ఈ సినిమాలకు ఓటీటీ వైవు నుంచి కూడా విశేషమైన ఆదరణ లభిస్తోంది. అలా మలయాళం నుంచి దిలీప్ కూడా మంచి హిట్ పట్టుకొచ్చాడు. ఆయన నటించిన ఆ సినిమా పేరే 'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ'. చూడటానికి టైటిల్ సాదాసీదాగానే కనిపిస్తున్నప్పటికీ మలయాళంలో ఈ సినిమా 25 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. 

మలయాళంలో దిలీప్ కి కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయి హిట్ ఆయనకి పడలేదు. ఈ సినిమా ఆ లోటును భర్తీ చేసిందని అంటున్నారు. బింటో స్టీఫెన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, సనల్ దేవ్ సంగీతాన్ని సమకూర్చాడు. మే 9వ తేదీన విడుదలైన ఈ సినిమాలో, ధ్యాన్ శ్రీనివాసన్ .. సిద్ధికీ .. బిందు పణిక్కర్ .. జాన్ ఆంటోనీ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ నెల 20వ తేదీ నుంచి 'జీ 5'లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 

కథలోకి వెళితే ప్రిన్స్ కి ఏజ్ పెరుగుతూ ఉంటుంది. కానీ సరైన అమ్మాయి తారసపడకపోవడం వలన ఆయన పెళ్లి చేసుకోడు. తనకి కాబోయ్ భార్య ఎలా ఉండాలనే విషయంలో ఆయనకి ఒక అభిప్రాయం ఉంది. కానీ పెళ్లి లేటవుతూ ఉండటం ఆయనను ఆందోళనకి గురిచేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒక యువతి ఆయన జీవితంలోకి అడుగుపడుతుంది. దాంతో ఆయన జీవితం ఎలా మారిపోతుంది? అనేదే కథ. 



More Telugu News