TDP: కూటమి పాలనలో ప్రయాణం సాఫీగా.. ఫొటోలు ఇవిగో!

- అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వాహనదారుల కష్టాలకు చెక్
- నాడు గుంతలమయంగా సామర్లకోట- బిక్కవోలు రోడ్డు
- నేడు సాఫీగా సాగిపోతున్న వాహనదారులు
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి కొలువుదీరిన తర్వాత రహదారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆర్‌అండ్‌బీ రోడ్లపై గుంతలమయంగా ఉన్న 19,354 కి.మీ. రోడ్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన వాటిపై ఉన్న 21,951 గుంతల్ని పూడ్చింది. భారీ గుంతలతో వాహనదారులకు చుక్కలు చూపించిన రోడ్లకు మరమ్మతులు చేసింది. నాడు రోడ్ల పరిస్థితిపై సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసిన వాహనదారులు నేడు ఆ మార్గాల్లో సాఫీగా ప్రయాణిస్తున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడేనాటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట నుంచి రాజమహేంద్రవరం వెళ్లే రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉండేది. భారీ గుంతలతో కంకర తేలి వాహనదారులకు నరకం చూపించేది. కూటమి ప్రభుత్వం ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి చక్కటి రహదారిగా మార్చేసింది. సామర్లకోట - బిక్కవోలు మార్గంలో జి.మేడపాడు వద్ద ఈ రహదారి నాడు ఎలా ఉంది నేడు ఎలా మారిందనేది ఫొటోలలో చూడొచ్చు.
మరమ్మతులకు రూ.860 కోట్లు..
రాష్ట్రంలోని ఆర్‌అండ్‌బీ రోడ్లను చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం రూ.860 కోట్లు కేటాయించింది. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి 20 వేల కి.మీ. మేర గుంతలమయంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించింది. 2025 సంక్రాంతి నాటికి ఈ రోడ్లను గుంతలరహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గతేడాది నవంబరులో పనులు ప్రారంభించారు. అయితే, 2024 డిసెంబర్ లో వర్షాలు కురవడంతో 2025 మార్చి వరకు పనులు కొనసాగాయి. ప్రస్తుతం 19,354 కి.మీ. మేర రోడ్లు గుంతల రహితంగా మారాయి.
సామర్లకోట రోడ్డు జి.మేడపాడు వద్ద గతంలో..

జి.మేడపాడు వద్ద ప్రస్తుతం..

మానుకొండ జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో గతంలో ఇలా..

మానుకొండ జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ప్రస్తుతం..
