Gaddar: గద్దర్ అవార్డుల మొమెంటో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Government Releases Gaddar Awards Momento

  • గద్దర్ ను గుర్తు చేసేలా సినీ అవార్డుల జ్ఞాపిక
  • జ్ఞాపికను విడుదల చేసిన తెలంగాణ సర్కార్
  • ఈ నెల 14న గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం
  • హజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

దశాబ్దకాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో సినిమా అవార్డులను ప్రకటించిన విషయం విదితమే. గద్దర్ అవార్డుల విజేతలను ఇదివరకే ప్రకటించిన ప్రభుత్వం, ఈ నెల 14న హైటెక్స్ వేదికగా అవార్డుల ప్రధానోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గద్దర్ అవార్డుల జ్ఞాపికను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.

జ్ఞాపికలో చేతికి రీల్ చుట్టుకున్నట్లుగా ఉండి, పైన చేతిలో డప్పు పట్టుకున్నట్లుగా, ఆ డప్పు మీద తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించారు. గద్దర్ గుర్తింపుగా డప్పును ముద్రించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సినిమాటోగ్రఫీ శాఖ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి.

14వ తేదీన జరగనున్న గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు విజేతలకు జ్ఞాపికలను అందజేస్తారు. ఈ వేడుక కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లను ఏర్పాటు చేయనున్నారు. 

Gaddar
Gaddar Awards
Telangana Government
Revanth Reddy
Bhatti Vikramarka
Komatireddy Venkat Reddy
Telangana Film Development Corporation
Cinematography Department
Telugu Cinema
Movie Awards
  • Loading...

More Telugu News