Manchu Lakshmi: 'కన్నప్ప'పై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు

Manchu Lakshmis Interesting Comments on Kannappa Movie

  • కన్నప్పలో తనకు సరిపోయే పాత్ర లేకపోవడం వల్లనే విష్ణు చాన్స్ ఇవ్వలేదని భావిస్తున్నానన్న మంచు లక్ష్మి
  • తన మద్దతు విష్ణుకు ఎప్పుడూ ఉంటుందని వెల్లడి
  • జనాలు అనుకుంటున్నట్లు తమ మధ్య ఏమీ లేదని వివరణ

కన్నప్ప మూవీపై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్పలో మంచు లక్ష్మి ఎందుకు నటించలేదంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఈ మూవీలో నటిస్తే మిగతా ఎవరూ కనిపించరంటూ సెటైర్ వేశారు. ఈ మూవీలో తనకు సరిపోయే పాత్ర లేదని భావిస్తున్నానని, అందుకే విష్ణు తనకు అవకాశం ఇవ్వలేదని అనుకుంటున్నానన్నారు. ఒకవేళ తాను చేయగలిగే పాత్ర ఉంటే విష్ణు అవకాశం ఇచ్చేవాడేమోనని, ఆ విషయం గురించి విష్ణునే అడగాలని చెప్పింది. 

కన్నప్ప మూవీలో తాను కూడా నటించి ఉంటే అది ఒక ఫ్యామిలీ మూవీ అని అంతా అనుకునేవారని, ఇప్పటికే తమ ఫ్యామిలీ చాలా మూవీల్లో కలిసి నటించామని లక్ష్మి పేర్కొంది. తనకు నటించే అవకాశం ఇవ్వకపోవడంతో తమ్ముడు విష్ణుకు తన మద్దతు లేదని అనుకుంటున్నారని, అది నిజం కాదని చెప్పుకొచ్చింది. సినిమాలో అవకాశం ఇవ్వలేకపోయినంత మాత్రాన తమ మధ్య ఏదో ఉందని అనుకోవద్దని చెప్పింది. తన మద్దతు ఎప్పుడూ విష్ణుకు ఉంటుందని పేర్కొంది. 

మంచు లక్ష్మి ఇటీవల పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. గతంలో వరుస సినిమాలు చేసిన లక్ష్మి గత ఏడాదిన్నరగా ఆమె నుంచి ఎలాంటి మూవీలు రాలేదు. రీసెంట్‌గా లెస్బియన్ మూవీలో కనిపించింది. అయితే కన్నప్ప మూవీలో లక్ష్మి నటించకపోవడంతో రకరకాల రూమర్లు వచ్చాయి. ఈ వదంతులకు చెక్ పెడుతూ లక్ష్మి ఈ సందర్భంగా వివరణ ఇచ్చింది. 

Manchu Lakshmi
Kannappa Movie
Manchu Vishnu
Tollywood
Telugu Cinema
Kannappa Film
Lesbian Movie
Lakshmi Manchu Comments
Telugu Movies
Indian Cinema
  • Loading...

More Telugu News