Saleem: భార్య అనుకుని పక్కింటి యువతిని పొడిచాడు!

Saleem attacks neighbor mistaking her for wife in Hyderabad

  • మద్యం మత్తులో అర్ధాంగి రేష్మతో గొడవ పడిన సలీం
  • చంపేస్తానంటూ కూరగాయలు కోసే కత్తితో బెదిరించిన సలీం
  • భయంతో బయటకు పరుగులు తీసిన సలీం అర్ధాంగి రేష్మ
  • అర్ధాంగి అనుకుని పక్కింటి మహిళ జుబేదాను పొడిచిన సలీం
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జుబేదా

భార్య, భర్తల మధ్య తలెత్తిన వివాదంలో తలదూర్చిన ఓ మహిళ ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. గొడవ పడుతున్న దంపతులను ఆపేందుకు ప్రయత్నించిన మహిళను తన భార్యగా భావించి ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సలీమ్ (60), రేష్మ దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతుండగా, మరొక కూతురు హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ టీఎన్‌జీవోస్ కాలనీలో నివాసముంటోంది. బక్రీద్ పండుగ సందర్భంగా సలీం దంపతులు హైదరాబాద్‌లోని తమ కూతురి ఇంటికి వచ్చారు.

సోమవారం రాత్రి సలీం మద్యం సేవించి వచ్చి భార్య రేష్మతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో రేష్మను చంపేస్తానంటూ కూరగాయలు కోసే కత్తితో బెదిరించాడు. దీంతో ఆమె కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీసింది. వారి గొడవను ఆపేందుకు పక్కింట్లో ఉంటున్న జుబేదా (26) అక్కడికి చేరుకుంది. అయితే జుబేదా వచ్చిన విషయాన్ని గమనించని సలీమ్, ఆమెను తన భార్య రేష్మగా భావించి కత్తితో పొడిచాడు.

దీంతో తీవ్రంగా గాయపడిన జుబేదా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాయపడిన జుబేదాను ఆసుపత్రికి తరలించారు. సలీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Saleem
Hyderabad
Mylardevpally
Crime
Stabbing
Wife
Neighbor
Family dispute
Telangana
Police
  • Loading...

More Telugu News