హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మికి ఫోన్ వేధింపులు
- జీహెచ్ఎంసీ మేయర్, ఆమె తండ్రి కేకే అంతు చూస్తానంటూ దుండగుడు బెదిరింపులు
- మేయర్ పీఆర్వో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు
బోరబండలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సర్ధార్‌కు చెందిన వ్యక్తిగా చెప్పుకున్నాడు. అసభ్యకరమైన పదజాలంతో బెదిరింపులు రావడంతో మేయర్ పీఆర్వో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎవరనే దానిపై ఫోన్ నెంబర్ ఆధారంగా ఆరా తీస్తున్నారు.