Revanth Reddy: రేవంత్ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం!... అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్

Revanth Reddy Cabinet Expansion Likely as High Command Gives Green Signal

  • తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఆమోదం
  • ఆదివారం రోజున కేబినెట్ విస్తరణ జరిగే సూచనలు
  • కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలిపింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో త్వరలోనే కొత్త మంత్రులు చేరే అవకాశం ఉంది. విస్తరణ ప్రక్రియ రేపు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురు నుంచి నలుగురు సభ్యులకు స్థానం కల్పించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై పార్టీలో అంతర్గత కసరత్తు వేగవంతమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై సీనియర్ నాయకులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.

అధిష్ఠానం నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించడంతో, మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలపడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Revanth Reddy
Telangana cabinet expansion
Congress party
Meenakshi Natarajan
Telangana PCC
  • Loading...

More Telugu News