Manchu Vishnu: 'కన్నప్ప' ఫైనల్ కాపీపై సంతృప్తి వ్యక్తం చేసిన మోహన్ బాబు, మంచు విష్ణు!

Manchu Vishnu Mohan Babu satisfied with Kannappa final copy

  • ప్రసాద్ ల్యాబ్స్ లో కన్నప్ప ఫైనల్ కాపీని వీక్షించిన మోహన్ బాబు, విష్ణు
  • ప్రసాద్ ల్యాబ్స్ వద్ద బౌన్సర్లతో భారీ బందోబస్తు
  • 27న ప్రేక్షకుల ముందుకు రానున్న కన్నప్ప

విడుదలకు సిద్ధంగా ఉన్న 'కన్నప్ప' మూవీ ఫైనల్ కాపీపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి వీఎఫ్ఎక్స్ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని విష్ణు ఇదివరకే మీడియాకు తెలిపారు.

ఫైనల్ కాపీ సిద్ధం కావడంతో ఆ కాపీని ప్రసాద్ ల్యాబ్స్‌లో మంచు మోహన్ బాబు, విష్ణు వీక్షించారు. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ వద్ద బౌన్సర్లతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫైనల్ కాపీ విషయంలో మోహన్ బాబు, విష్ణు సంతృప్తి వ్యక్తం చేసినట్లు మూవీ టీమ్ చెబుతోంది. ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఇప్పటికే ఖరారైంది. ఈ నెల 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి అనేక విషయాలను వారు వెల్లడిస్తూ వచ్చారు. మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్మాణ సంస్థ నిర్వహిస్తోంది. త్వరలో ట్రైలర్ విడుదల కార్యక్రమం ఉండనుందని సమాచారం. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రభాస్ కూడా వస్తారనే టాక్ వినిపిస్తోంది. ఏపీలోని భీమవరం గ్రామంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. దీంతో వీరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Manchu Vishnu
Kannappa movie
Mohan Babu
Prabhas
Kannappa release date
Manchu family
Telugu movie
Bheemavaram
Kajal Aggarwal
Akshay Kumar
  • Loading...

More Telugu News