Nikhil Sosale: ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్.. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి

Nikhil Sosale RCB Marketing Head Arrested at Bangalore Airport
  • ముంబై వెళ్తుండగా నిఖిల్ సోనాలే అరెస్ట్
  • తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో చర్యలు
  • ఓ ఈవెంట్ సంస్థ అధికారులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆయనను బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. బెంగళూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నిఖిల్ సోసాలేను అరెస్ట్ చేసినట్టు సమాచారం.

ఇదే కేసుకు సంబంధించి పోలీసులు ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన కొందరు అధికారులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. నిఖిల్ సోసాలేను పోలీసులు ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆర్సీబీ యాజమాన్యం గానీ, నిఖిల్ సోసాలే కుటుంబ సభ్యులు గానీ ఈ అరెస్ట్ పై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వార్త ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  
Nikhil Sosale
RCB
Royal Challengers Bangalore
Bangalore Airport
Arrest
Marketing Head
Stampede
Event Management
Bengaluru

More Telugu News