Telangana Police: తెలంగాణలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ

Telangana Government Transfers Seven Senior IPS Officers
  • పోలీస్ అకాడమి డైరెక్టర్‌గా అభిలాష బిస్త్
  • మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు డీజీగా చారు సిన్హా
  • ఎఫ్ఎస్ఎల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా కొనసాగనున్న శిఖా గోయల్
తెలంగాణ ప్రభుత్వం ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్, మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు డీజీగా చారు సిన్హా, చార్మినార్ రేంజ్ డీఐజీగా తప్సీర్ ఇక్బాల్ నియమితులయ్యారు. శిఖా గోయల్ ఎఫ్ఎస్ఎల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. మెదక్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు, ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా చైతన్యకుమార్ బదిలీ అయ్యారు. 
Telangana Police
IPS Transfers
Abhilasha Bisht
Charu Sinha
Tapseer Iqbal
Shikha Goel
DV Srinivasa Rao
Patil Kanthilal Subhash
Chaitanya Kumar
Telangana Government

More Telugu News