Nellore accident: వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొన్న కారు .. నలుగురు మృతి, మరో పది మందికి గాయాలు

Andhra Pradesh Accident Car Hits Auto Kills four
  • పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద ఘటన
  • ప్రమాదానికి గురైన పొగాకు గ్రేడింగ్ కోసం వెళుతున్న కూలీలు
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలంలోని ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది.

వెంకటరావుపల్లి నుండి ముస్తాపురం గ్రామానికి పొగాకు గ్రేడింగ్ పనుల కోసం వ్యవసాయ కూలీలు ఆటోలో వెళుతుండగా, ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్దకు చేరుకున్న సమయంలో కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదంపై జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. 
Nellore accident
Andhra Pradesh accident
Road accident
Accident news
Anam Ramanarayana Reddy
Atmakur
Potti Sriramulu Nellore district
Agricultural workers

More Telugu News