Nagarjuna: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో హీరో నాగార్జున భేటీ

- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన హీరో నాగార్జున
- భట్టి నివాసంలో మర్యాదపూర్వకంగా సాగిన సమావేశం
- చిన్న కుమారుడు అఖిల్ వివాహానికి ఆహ్వానం
- స్వయంగా వెళ్లి శుభలేఖ అందజేసిన నాగార్జున
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున బుధవారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. హైదరాబాద్‌లోని ఉప ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది. తన చిన్న కుమారుడు, యువ హీరో అక్కినేని అఖిల్ వివాహ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా భట్టి విక్రమార్కను నాగార్జున స్వయంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాగార్జున... అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను ఉప ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం వారిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. అక్కినేని అఖిల్ నిశ్చితార్థం గత ఏడాది నవంబర్‌లో జరిగింది. అక్కినేని నాగార్జున తన కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులను ఆహ్వానించారు.