Kishore: 'వడక్కన్' .. తెలుగు ఆడియన్స్ వెయిటింగ్!

- మలయాళ సినిమాగా 'వడక్కన్'
- ఆసక్తిని రేకెత్తించే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
- ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
- ఈ నెల 6వ తేదీ నుంచి ఆహా తమిళ్ లో
ఈ మధ్య కాలంలో ఒకే సినిమా వివిధ ఓటీటీ ట్రాకులపైకి వచ్చేస్తోంది. అలా ఒకటికి మించి ఓటీటీ సెంటర్లలో ఆయా సినిమాలను చూసే అవకాశం లభిస్తోంది. అదే దార్లో ఇప్పుడు మరో సినిమా ఇంకో ఓటీటీ సెంటర్ లోకి వచ్చింది. ఆ సినిమా పేరే 'వడక్కన్'. కిశోర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ మలయాళ సినిమాకి సాజిద్ దర్శకత్వం వహించాడు.
మలయాళంలో 'వడక్కన్' సినిమా మార్చి 7వ తేదీన విడుదలైంది. మలయాళంలో రూపొందిన ఫస్టు పారానార్మల్ థ్రిల్లర్ గా ఈ సినిమాకి గట్టి ప్రచారం లభించింది. ఘోస్ట్ ఎలిమెంట్స్ తో కూడిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది. దాంతో థియేటర్స్ వైపు నుంచి ఈ సినిమాకి ఆశించిన రెస్పాన్స్ దక్కింది. మే 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది.
అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఇంగ్లిష్ .. కన్నడ .. మలయాళం భాషలలో అందుబాటులో ఉంది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 6వ తేదీ నుంచి 'ఆహా తమిళ్' లో స్ట్రీమింగ్ కి రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగులో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. త్వరలో తెలుగులోను రానుందనే టాక్ వినిపిస్తోంది. ఓ టీవీ రియాలిటీలో వరుస హత్యలు జరుగుతాయి. ఆ మిస్టరీని ఛేదించడానికి కిశోర్ రంగంలోకి దిగుతాడు. ఆయనకు ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? అనేది కథ.