Priyamani: ప్రియమణి ప్రధాన పాత్రగా లీగల్ థ్రిల్లర్ .. జియో హాట్ స్టార్ లో!

- ప్రియమణి ప్రధాన పాత్రగా 'గుడ్ వైఫ్'
- లాయర్ గా కనిపించనున్న ప్రియమణి
- కీలకమైన పాత్రల్లో రేవతి - సంపత్ రాజ్
- త్వరలో స్ట్రీమింగ్ కి రానున్న సిరీస్
ఒక వైపున సినిమాలలో ముఖ్యమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున వెబ్ సిరీస్ లతో ప్రియమణి బిజీగా ఉంది. తెలుగులో ఆమె చేసిన 'భామ కలాపం' ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 'ది ఫ్యామిలీ మేన్' సిరీస్ కూడా ఆమెకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రధానమైన పాత్రగా ఒక వెబ్ సిరీస్ నిర్మితమైంది .. ఆ సిరీస్ పేరే 'గుడ్ వైఫ్'.
ఇది ఒక అమెరికన్ షో ఆధారంగా రూపొందిన సిరీస్. తమిళంలో రూపొందించిన ఈ సిరీస్ ను, తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ .. బెంగాలీ .. మరాఠీ భాషలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సిరీస్ నుంచి వదిలిన ఫస్టు పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో రేవతి .. సంపత్ రాజ్ .. ఆరి అర్జునన్ కనిపించనున్నారు.
కథ విషయానికి వస్తే .. ప్రియమణి ఈ సిరీస్ లో లాయర్ పాత్రలో కనిపించనుంది. మాజీ లాయర్ అయిన ఆమె, భర్త .. ఇద్దరు పిల్లలతో కలిసి హాయిగా జీవిస్తూ ఉంటుంది. అయితే ఊహించని విధంగా ఆమె భర్త సెక్స్ స్కాండల్ లో చిక్కుకుంటాడు. సమాజం అంతా ఆ కుటుంబం వైపు చూస్తూ ఉంటుంది. తన భర్త నిర్దోషి అని నిరూపించడం కోసం ఆమె లాయర్ గా మళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఆ తరువాత చోటుచేసుకునే మలుపులే మిగతా కథ.