Pakistan: మలేషియాలో పాకిస్థాన్‌కు షాక్.. భారత కార్యక్రమాల రద్దు వినతి తిరస్కరణ

Pakistan request to cancel Indian events in Malaysia rejected
  • మలేషియాలో భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం
  • సంజయ్ ఝా నేతృత్వంలోని బృందం కార్యక్రమాలు రద్దు చేయాలని వినతి
  • మతపరమైన కారణాలు చూపుతూ మలేషియాపై పాక్ ఒత్తిడి
  • పాకిస్థాన్ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన మలేషియా
  • ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన మలేషియా
అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ చేసే ప్రయత్నాలకు మరోసారి చుక్కెదురైంది. మలేషియాలో భారత ప్రతినిధి బృందం నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలను రద్దు చేయాలని పాకిస్థాన్ చేసిన విజ్ఞప్తిని మలేషియా ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. సంజయ్ ఝా నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం మలేషియాలో ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పది కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, ఈ కార్యక్రమాలను అడ్డుకునేందుకు పాకిస్థాన్ రాయబార కార్యాలయం తీవ్రంగా ప్రయత్నించింది. మలేషియా ప్రభుత్వ అధికారులను సంప్రదించిన పాక్ ప్రతినిధులు.. రెండు దేశాలు ఇస్లామిక్ దేశాలేనని, కాబట్టి భారత ప్రతినిధి బృందం మాటలు వినొద్దని, మలేషియాలో వారి కార్యక్రమాలను రద్దు చేయాలంటూ మతపరమైన కోణంలో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. 

అయితే, పాకిస్థాన్ చేసిన ఈ అభ్యర్థనను మలేషియా ప్రభుత్వం పట్టించుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశం పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్ వినతిని మలేషియా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ చేస్తున్న భారత్ వ్యతిరేక ప్రచారానికి ఒక ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు.  
Pakistan
India
Malaysia
Operation Sindoor
Sanjay Jha
Kashmir
United Nations
Indian Delegation
Islamic countries
International relations

More Telugu News