Surekha Vani: నెగెటివ్ కామెంట్లపై నటి సురేఖావాణి స్పందన ఇలా..

- ఆర్టిస్టులపై కామెంట్లు మామూలేనన్న నటి సురేఖావాణి
- తొలుత నెగెటివ్ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యేవాళ్లమన్న నటి
- కానీ తర్వాత తర్వాత వాటి గురించే మాట్లాడుకోవడం మానేశామని స్పష్టీకరణ
- అన్ని బుర్రలు ఒకేలా ఆలోచించవన్న సురేఖ
పొట్టి దుస్తులపై వచ్చే వ్యతిరేక వ్యాఖ్యలపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సీనియర్ నటి సురేఖావాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె కుమార్తె హీరోయిన్‌గా నటించిన 'చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి' మూవీ టైటిల్ గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి సురేఖావాణి వ్యతిరేక వ్యాఖ్యలపై వచ్చిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. సినిమాలో పనిచేసే నటీనటులు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతుండటం మామూలేనని చెప్పింది. వాటిని చూసి జనం పొట్టి దుస్తులపై వ్యతిరేక కామెంట్లు చేస్తుంటారని పేర్కొంది. అన్ని బుర్రలు ఒకేలా ఆలోచించవని చెప్పింది.
‘వాడేదో ఆలోచించుకుని, ఏదో అనుకుని ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తాడు. వాటిని ఎంత వరకు తీసుకోవాలన్నది మనకు తెలిసుండాలి. మొదట్లో నేను, నా కూతురు ఆ వ్యాఖ్యలకు స్పందించే వాళ్లం. తర్వాత వాటిని చూసి నవ్వుకోవడం మొదలు పెట్టాం. ఆ తర్వాత వాటి గురించి మాట్లాడుకోవడం కూడా మానేశాం’ అని సురేఖావాణి చెప్పుకొచ్చింది.