బ్యాంకు దోపిడీ చుట్టూ తిరిగే 'కొల్లా' .. ఓటీటీలో!

  • మలయాళంలో రూపొందిన 'కొల్లా'
  • ప్రధాన పాత్రల్లో ప్రియా ప్రకాశ్ - రజీషా
  • దొంగతనం నేపథ్యంలో సాగే కథ
  • ఈ  నెల 19 నుంచి ఈటీవీ విన్ లో    

మలయాళం నుంచి మరో సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది ... ఆ సినిమా పేరే 'కొల్లా'. ప్రియా ప్రకాశ్ వారియర్ - రజీషా విజయన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, సూరజ్ వర్మ దర్శకత్వం వహించాడు. 2023 జూన్ 9వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. షాన్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చిన సినిమా ఇది. 
 
రాజీశ్ నిర్మించిన ఈ సినిమా, రెండేళ్ల తరువాత తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ కానుంది.  ఒక బ్యాంక్ దొంగతనం చుట్టూ ఈ కథ  తిరుగుతుంది. వినయ్ .. కొల్లం సుధి .. ప్రేమ్ ప్రకాశ్ తదితరులు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

కథ విషయానికి వస్తే .. యాని .. శిల్ప ఇద్దరికీ కూడదబ్బు అవసరమవుతుంది. అంత డబ్బు కోసం బ్యాంకుకి కన్నం వేయడం మినహా మరో మార్గం లేదని భావిస్తారు. పక్కాగా ప్లాన్ చేసి బ్యాంకు నుంచి డబ్బు - బంగారం కాజేస్తారు. ఎక్కడికీ పారిపోకుండా అదే ఊళ్లో ఉంటూ తమపై అనుమానం రాకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు. ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేదే మిగతా కథ.



More Telugu News