Anil Chauhan: పహల్గామ్ దాడికి ముందు పాక్ ఆర్మీ చీఫ్ భారత్‌పై విషం కక్కాడు: సీడీఎస్ అనిల్ చౌహాన్
- పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తోందన్న సీడీఎస్ అనిల్ చౌహాన్
- కశ్మీర్ లో రక్తపాతం సృష్టించడమే వారి ప్రధాన విధానమని విమర్శలు
- పుణెలో భవిష్యత్ యుద్ధాలపై సీడీఎస్ కీలక ప్రసంగం
పహల్గామ్ ఉగ్రదాడికి ముందు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ భారత్‌పై, హిందువులపై తీవ్ర విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఆరోపించారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి నిరంతరం మద్దతు ఇస్తోందని, ఇక్కడ రక్తపాతం సృష్టించడమే వారి ప్రధాన విధానమని ఆయన తీవ్రంగా విమర్శించారు.
పుణెలోని సావిత్రిబాయి ఫులే యూనివర్సిటీలో జరిగిన 'భవిష్యత్తు యుద్ధాలు, యుద్ధక్షేత్రాలు' అనే అంశంపై జనరల్ అనిల్ చౌహాన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయంగా సంఘర్షణల స్వభావం మారుతోందని, సాంకేతిక ముప్పు పెరుగుతోందని అన్నారు. భారత్ సుదీర్ఘ కాలంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న తీరును ఆయన వివరించారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తూనే ఉందని, ఇక్కడ అశాంతిని సృష్టించాలని చూస్తోందని మండిపడ్డారు.