Malavika Menon: గ్లామరస్ గా నటిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్న హీరోయిన్

- చాలామంది హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేస్తున్నారని వ్యాఖ్య
- సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లపై మాళవిక మీనన్ ఫైర్
- అవకాశాల కోసమే గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తోందన్న కామెంట్లపై వివరణ
సినిమాల్లో గ్లామరస్ గా నటిస్తే తప్పేంటని మలయాళ నటి మాళవిక మీనన్ ఎదురు ప్రశ్నిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తున్న మాళవిక.. తనపై నెగెటివ్ ప్రచారం చేసే వారిని పట్టించుకోనని చెప్పింది. ఎక్స్ పోజింగ్ విషయంలో చాలామంది హీరోయిన్లు ఉదారంగా ఉంటున్నారని తెలిపింది. తాను ఒక్కదాన్నే గ్లామర్ గా నటించడంలేదని, మిగతా హీరోయిన్లు కూడా బాడీ షో చేస్తున్నారని గుర్తుచేసింది.
తమిళ, మలయాళ భాషల్లో చిత్రాలతో బిజీగా ఉన్న మాళవిక కోలీవుడ్‌లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. తెలుగులో ‘అమ్మాయిలు అంతే అదో టైపు’, ‘వందనం’ వంటి చిత్రాల్లో నటించినా పెద్దగా ఫేమ్ రాలేదు. దీంతో, ఓవైపు తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే మలయాళ ఇండస్ట్రీపై మాళవిక ఫోకస్ పెట్టింది. తన ఇన్ స్టాలో మాళవిక షేర్ చేస్తున్న ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు నటిపై ఫైర్ అవుతున్నారు. అవకాశాల కోసమే ఇలా ఎక్స్ పోజ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు.
ఈ కామెంట్లపై మాళవిక తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. ‘అవకాశాల కోసమే ఫొటోలు షేర్ చేయడం లేదు. అయినా గ్లామర్‌గా నటించడంలో తప్పేముంది. నా గురించి ఉన్నవీ లేనివీ ప్రచారం చేసే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాలాగే చాలామంది హీరోయిన్లు గ్లామర్ పాత్రల్లో నటిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చింది.
