Raja Saab: 'రాజాసాబ్' రిలీజ్ డేట్‌, టీజర్‌పై కీల‌క అప్‌డేట్‌.. థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేది ఎప్పుడంటే..!

Prabhas Raja Saab Horror Comedy Release Date and Teaser Details

  • మారుతి, ప్ర‌భాస్ కాంబోలో 'రాజాసాబ్‌'
  • మూవీని డిసెంబ‌ర్ 5న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • ఈ నెల 16న ఉద‌యం 10.52 గంట‌ల‌కు టీజ‌ర్ రిలీజ్ చేస్తామ‌న్న‌ మేక‌ర్స్

రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం 'రాజాసాబ్'. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడం, రిలీజ్ వాయిదా పడుతుండడంతో ఫ్యాన్స్ లో కొంత నిరాశ నెలకొంది. అయితే, అభిమానుల్లో ఫుల్ జోష్ నింపేందుకు మేక‌ర్స్ ఈ సినిమా గురించి కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. మూవీ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు. అలాగే టీజ‌ర్ విడుద‌ల తేదీని కూడా అనౌన్స్ చేశారు. 

ఈ సినిమాను డిసెంబ‌ర్ 5వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అలాగే ఈ నెల 16న ఉద‌యం 10.52 గంట‌ల‌కు టీజ‌ర్ రిలీజ్ చేస్తామ‌ని తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. 

ఇక‌, ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా... యువ క‌థానాయిక‌ రిద్ధి కుమార్ ప్ర‌త్యేక పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సంజయ్ దత్ ఇందులో ప్రభాస్ పాత్రకు తాతగా కీలక పాత్రలో కనిపించనున్నారు. వారి మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో హను రాఘవపూడి 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', 'సలార్-2', 'కల్కి-2' లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ, 'రాజాసాబ్' చిత్రం ప్రభాస్ కెరీర్ లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని సినీ వ‌ర్గాల్లో టాక్. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు.   

Raja Saab
Prabhas
Maruthi
Malavika Mohanan
Nidhi Aggerwal
Sanjay Dutt
People Media Factory
Thaman
Telugu Movie
Horror Comedy
  • Loading...

More Telugu News