Dhanush: ఇలాంటి సర్కస్ లు వద్దు... మానుకోండి: ధనుష్

Dhanush Strong Counter to Critics Stop These Circuses

  • విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటుడు ధనుష్
  • వ్యతిరేక ప్రచారాలు చేసుకోండి ఏమీ కాదన్న ధనుష్
  • అభిమానులు ఎప్పుడూ తనవెంటే ఉన్నారన్న ధనుష్
  • ఈ నెల 20న విడుదల కానున్న కుబేర

ఇలాంటి సర్కస్‌లు వద్దు.. మానుకోండి అంటూ విమర్శకులకు నటుడు ధనుష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ధనుష్, నాగార్జున కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ కుబేర ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక కథానాయికగా నటించారు.

తాజాగా ఈ మూవీ ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుష్ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా ప్రసంగించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

'నేనెప్పుడూ నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. నాపై, నా మూవీలపై ఎంత వ్యతిరేక ప్రచారం చేస్తారో చేసుకోండి. నా మూవీల విడుదలకు ముందు నెలకు రెండు సార్లు ఏదో ఒక విషయంలో కుట్రలు చేస్తూనే ఉంటారు. అయినా మీరేమి చెయ్యలేరు. ఎందుకంటే నా అభిమానులు ఎప్పుడూ నాతోనే ఉన్నారు. ఇలాంటి సర్కస్‌లు మానుకోండి. ఇక్కడ ఉన్నవారంతా నా అభిమానులు మాత్రమే కాదు.. వీరంతా 23 సంవత్సరాలుగా నా వెంటే ఉంటున్నారు. మీరెంత వ్యతిరేక ప్రచారం చేసినా వీరంతా ఎప్పటికీ నాతోనే ఉంటారు’ అని ధనుష్ కుండబద్దలు కొట్టారు. 

Dhanush
Kubera
Dhanush movie
Sekhar Kammula
Nagarjuna
Rashmika Mandanna
Pan India movie
Tamil cinema
Telugu cinema
Movie release
  • Loading...

More Telugu News