KCR: కాళేశ్వరం విచారణ: కేసీఆర్ హాజరు తేదీలో మార్పు.. ఎందుకంటే

- కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ అంశం
- జూన్ 5కు బదులుగా జూన్ 11న హాజరుకానున్న కేసీఆర్
- కేసీఆర్ విజ్ఞప్తి మేరకు తేదీని మార్చిన కమిషన్
కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై విచారణ జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఆయన చేసిన అభ్యర్థన మేరకు కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్, విచారణలో భాగంగా కేసీఆర్ ను హాజరు కావాలని గతంలో ఆదేశించింది. ఈ మేరకు తొలుత జూన్ 5వ తేదీని ఖరారు చేసింది. అయితే, ఆ తేదీన హాజరు కాలేనని, వేరే తేదీని కేటాయించాలని కేసీఆర్ కమిషన్‌ను కోరారు.
కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన కాళేశ్వరం కమిషన్, విచారణ తేదీని మార్పు చేసింది. జూన్ 5వ తేదీకి బదులుగా జూన్ 11వ తేదీన కమిషన్ ముందు హాజరుకావాలని సూచించింది. దీంతో కేసీఆర్ జూన్ 11న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది.