Tovuri Narasimham: నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య .. మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!

TDP Leader Tovuri Narasimham Brutally Murdered in Nellore

  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తోవూరి నరసింహం హత్య కేసులో బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బోరుబావి వద్ద ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన లింగసముద్రం మండలంలో చోటు చేసుకుంది. తాతా హోటల్ పక్కన జంపాలవారపాలెంలో టీడీపీ నాయకుడు తోవూరి నరసింహంను బ్రహ్మయ్య కత్తితో పొడిచి హత్య చేశాడు.

అంతటితో ఆగకుండా రెండు రోజులపాటు నరసింహం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బోరుబావిలో వేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నరసింహం నిమ్మతోట వద్ద బ్రహ్మయ్య కాపలాదారుడిగా పని చేస్తున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి మధ్య ఏ విషయంలో వివాదం జరిగింది, నరసింహంను ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడు అనే విషయాలు తెలియాల్సి ఉంది.

నరసింహం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్రహ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బోరుబావి వద్దకు వెళ్లి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 

Tovuri Narasimham
Nellore district
TDP leader murder
Lingasamudram
Brahmaiah
Andhra Pradesh crime
Political murder
Crime news Andhra Pradesh
Nellore crime
Telugu Desam Party
  • Loading...

More Telugu News