Nara Lokesh: ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం ఇది: ఏపీ మంత్రి నారా లోకేశ్

- గత ప్రభుత్వం ఖాళీగా వదిలివేసిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలి ఏడాదిలోనే తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న నారా లోకేశ్
- మెయిన్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్ధులకు ఆల్ ద బెస్ట్ అంటూ లోకేశ్ శుభాకాంక్షలు
రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల జాతర మొదలైందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. గత ప్రభుత్వం ఖాళీగా వదిలివేసిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలి ఏడాదిలోనే తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక పరీక్షలు పూర్తి చేయగా, ఆదివారం మెయిన్ పరీక్ష నిర్వహించబోతున్నామన్నారు. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ అంటూ లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.