RCB: 'దేవుడా.. ఈసారి ఆర్‌సీబీ క‌ప్ గెల‌వాలి'.. కొండ‌గ‌ట్టు అంజ‌న్నకు ఓ అభిమాని మొర‌

Royal Challengers Bangalore Fan Prays for RCB Victory at Kondagattu

  • క్వాలిఫ‌య‌ర్‌-1లో పంజాబ్‌ను ఓడించి ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన బెంగ‌ళూరు
  • ఈసారి ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలని కోరుకుంటున్న‌ ఆర్‌సీబీ ఫ్యాన్స్‌
  • కొండ‌గ‌ట్టు ఆల‌యం హుండీలో 'దేవుడా.. ఈసారి ఆర్‌సీబీ క‌ప్ గెల‌వాలి' అని చీటీ రాసి వేసిన‌ ఓ అభిమాని 
  • అభిమాని చీటీ తాలూకు ఫొటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌

ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) టోర్నీ ఆసాంతం అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. మొన్న జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-1లో ఆల్‌రౌండ‌ర్ షోతో బ‌ల‌మైన పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)ను ఓడించి ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఆ జ‌ట్టు అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా బెంగ‌ళూరు క‌ప్పు గెలవాల‌ని వారు కోరుకుంటున్నారు.

ఆర్‌సీబీ గెలుపు కోసం కొంద‌రు పూజ‌లు సైతం మొద‌లుపెట్టారు. కొంద‌రు ప‌లు ఆల‌యాల‌కు వెళ్లి త‌మ అభిమాన‌ జ‌ట్టు ఫైన‌ల్ లో గెలవాల‌ని దేవుళ్ల‌కు మొర‌పెట్టుకుంటున్నారు. ఈక్ర‌మంలో తాజాగా నాకు భ‌క్తి ఉంది దానికి దేవుని మొక్కు కూడా ఉంద‌ని ఓ ఆర్‌సీబీ భ‌క్తుడు ఆ జ‌ట్టుపై త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. 

ఈసారి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ కప్పు గెల‌వాలని కొండగట్టు అంజన్న హుండీలో చీటీ రాసి వేశాడు. "ప్లీజ్ దేవుడా.. ఈసారి ఆర్‌సీబీ ట్రోఫీ గెల‌వాలి.. ఈ సారి క‌ప్ మ‌న‌దే" అంటూ చీటీపై రాశాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదే మాదిరి క్వాలిఫ‌య‌ర్‌-1లో పంజాబ్‌తో బెంగ‌ళూరు ఆడుతున్న స‌మ‌యంలో ఓ మ‌హిళా అభిమాని స్టాండ్స్‌లో ప్ర‌ద‌ర్శించిన ప్లకార్డు కూడా నెట్టింట వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. "ఈసారి ఆర్‌సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవకపోతే తన భర్తకు విడాకులు ఇస్తా" అంటూ ప్లకార్డుపై రాసి స్టేడియంలో ప్రదర్శించిందామె. దానిపై కింగ్ కోహ్లీ హ్యాష్ ట్యాగ్‌ను కూడా జోడించడం గ‌మ‌నార్హం. 

కాగా, అభిమానుల కోరిక మేర‌కు బెంగ‌ళూరు ఈసారి టైటిల్ సాధిస్తుందేమో చూడాలి. ఇప్ప‌టివ‌ర‌కు మూడుసార్లు ఫైన‌ల్‌కు వెళ్లి, త్రుటిలో టైటిల్ చేజార్చుకుంది. ఇప్పుడు నాలుగో సారి ఆర్‌సీబీ ఫైన‌ల్‌కు వెళ్లింది. జూన్ 3న అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. రేపు (ఆదివారం) ఇదే వేదిక‌లో జ‌రిగే క్వాలిఫ‌య‌ర్‌-2 (ఎంఐ వ‌ర్సెస్ పీబీకేఎస్‌) విజేత‌తో ఫైన‌ల్లో ఆర్‌సీబీ త‌ల‌ప‌డ‌నుంది. 

RCB
Royal Challengers Bangalore
IPL 2025
Kondagattu Anjanna
RCB Fan
IPL Final
Virat Kohli
Punjab Kings
Cricket
Ahmedabad
  • Loading...

More Telugu News