సూప‌ర్‌ స్టార్ కృష్ణ రియ‌ల్ లైఫ్‌లోనూ హీరోనే.. జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌

  • నేడు సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి
  • ఈ సంద‌ర్భంగా ఎక్స్ వేదిక‌గా నివాళి తెలిపిన జ‌గ‌న్‌
  • సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా కృష్ణ హీరోగా నిలిచార‌న్న మాజీ సీఎం
నేడు సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా సినీ, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా కృష్ణ‌కు ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా నివాళి తెలుపుతూ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేశారు. 

సూప‌ర్‌స్టార్ కృష్ణ సినిమాల్లోనే కాదు... రియ‌ల్ లైఫ్‌లోనూ హీరోనే అన్నారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయ‌న తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో ప్ర‌యోగాలు చేసి విజ‌యవంత‌మ‌య్యార‌ని కొనియాడారు. ఈ మేర‌కు జ‌గ‌న్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

"సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నిలిచారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. నిర్మాత‌గా, ద‌ర్శకుడిగా, ఎడిట‌ర్‌గా, స్టూడియో అధినేత‌గా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. 

తెలుగు ప్రజ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. అల్లూరి పేరు చెబితే... మనకు కృష్ణాగారే మదిలో మెదులుతారు. రాజ‌కీయాల్లోనూ రాణించారు. నిర్మాతలు, కార్మికుల కష్టాల్లో అండగా నిలిచి పెద్ద మనసును చాటుకున్నారు. నాన్నగారికి అత్యంత ఆప్తులు అయిన కృష్ణ గారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు" అని జ‌గ‌న్ త‌న పోస్టులో రాసుకొచ్చారు. 


More Telugu News