Akhil Akkineni: అఖిల్ వివాహం.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం

- ఈరోజు ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున, అమల దంపతులు
- తన కుమారుడి పెళ్లికి రావాల్సిందిగా సీఎం రేవంత్‌కు నాగార్జున ఆహ్వానం
- జూన్ 6న అఖిల్- జైనబ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం
అక్కినేని ఇంట మరోసారి పెళ్లిబాజాలు మోగనున్నాయి. గతేడాది నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య-శోభితా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రముఖ బిజినెస్‌మెన్ జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో గతేడాది నవంబర్ 26న అఖిల్ నిశ్చితార్థం జరిగింది.
జూన్ 6న అఖిల్- జైనబ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని నాగార్జున ఆహ్వానించారు. ఈరోజు ఉదయం భార్య అమల, వియ్యంకులతో కలిసి జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను కలిశారు.
అనంతరం అఖిల్ వెడ్డింగ్ కార్డుని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. కాగా, అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ వివాహం జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత రాజస్థాన్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.