Donald Trump: చైనా అసలు రంగు బయటపడింది.. మంచిగా ఉన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది: డొనాల్డ్ ట్రంప్
- చైనాపై మరోసారి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు
- వాణిజ్య ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని ఆరోపణ
- "అతి మంచితనం పనికిరాదు" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్
- తన సుంకాల వల్లే చైనా ఆర్థిక ఇబ్బందులు పడిందన్న ట్రంప్
- ఒప్పందం తర్వాత చైనా నిజస్వరూపం బయటపెట్టిందని వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని చైనా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమ వేదిక 'ట్రూత్ సోషల్'లో "అతి మంచితనం పనికి రాదు" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే, చైనా ఏ విషయంలో ఒప్పందాన్ని ఉల్లంఘించిందనే వివరాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు.
కొన్ని వారాల క్రితమే ఇరు దేశాలు పరస్పరం సుంకాలు విధించుకుంటూ వాణిజ్య యుద్ధానికి దిగడం, ఆ తర్వాత చర్చలకు అంగీకరించడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
"రెండు వారాల క్రితం చైనా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నేను విధించిన కఠినమైన సుంకాల దెబ్బకు అమెరికాతో వాణిజ్యం చేయడం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో చైనాలో పరిస్థితులు మరింత దిగజారాయి. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ పౌర అశాంతి నెలకొంది" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకే తాను చైనాతో వేగంగా ఓ ఒప్పందం కుదుర్చుకున్నానని ట్రంప్ తెలిపారు. "ఈ ఒప్పందం కారణంగా చైనాలో పరిస్థితులు చక్కబడ్డాయి. డ్రాగన్ దేశం మళ్ళీ యథావిధిగా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించింది. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకున్నాను. కానీ, సరిగ్గా అప్పుడే చైనా తన అసలు రంగు బయటపెట్టింది. మాతో చేసుకున్న ఒప్పందాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించింది. ఇది ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. మంచిగా వ్యవహరించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది" అని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.