ర‌వితేజ ‘మాస్ జాత‌ర’ రిలీజ్ డేట్ ఫిక్స్

  • రవితేజ, భాను భోగవరపు కాంబినేష‌న్‌లో ‘మాస్ జాత‌ర’
  • వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఆగ‌స్టు 27న ప్రేక్ష‌కుల ముందుకు మూవీ
  • అధికారికంగా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన మేక‌ర్స్
మాస్ మహారాజా రవితేజ, భాను భోగవరపు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘మాస్ జాత‌ర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్‌. ఈ సినిమాను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఆగ‌స్టు 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు తాజాగా చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది. 

దీంతో అభిమానులు వినాయక చవితి పండక్కి థియేటర్స్ లో మాస్ జాతరే అంటున్నారు. ఇక‌, ఈ మూవీలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరూ గతంలో ‘ధమాకా’తో ప్రేక్షకులను అలరించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

కాగా, ‘ధమాకా’ తర్వాత ర‌వితేజ‌కు పెద్ద హిట్ దక్కలేదు. గతేడాది విడుదలైన ఈగల్, మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ చిత్రాలు తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. దీంతో ‘మాస్ జాత‌ర’ ద్వారా రవితేజ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. 


More Telugu News