క్వాలిఫయర్-1 వర్షం వల్ల రద్దైతే జరిగేది ఇదే..!
- ముల్లాన్‌పూర్ వేదికగా క్వాలిఫయర్-1
- ఈ మ్యాచ్‌లో తలపడనున్న పీబీకేఎస్, ఆర్‌సీబీ
- ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే.. లీగ్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా ఉన్న పీబీకేఎస్ ఫైనల్‌కు
ఇవాళ జరిగే క్వాలిఫయర్-1లో పోటీ పడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళుతుంది. అయితే, ఒకవేళ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే? పైగా క్వాలిఫయర్-1కి రిజర్వ్ డే కూడా లేదు. కాబట్టి ముల్లాన్‌పూర్‌లో వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే ఏమి జరుగుతుంది?
ఐపీఎల్ నిబంధనల ప్రకారం లీగ్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా ఉన్న పీబీకేఎస్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక, ఆర్‌సీబీ... ముంబయి ఇండియన్స్ (ఎంఐ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరిగే ఎలిమినేటర్ విజేతతో తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో పంజాబ్‌తో ఆడుతుంది.
ఇక, 2014 తర్వాత తొలిసారిగా ప్లే-ఆఫ్‌లకు చేరిన పంజాబ్ కింగ్స్ జట్టు ఎలాగైనా ఈసారి కప్పు గెలవాలనే కసితో ఉంది. అటు ఆర్‌సీబీ కూడా తమకు అందని ద్రాక్షగా మిగిలిన ఐపీఎల్ టైటిల్‌ను ఈ ఏడాది గెలిచి తీరుతామని చెబుతోంది.