క్వాలిఫ‌య‌ర్‌-1 వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దైతే జ‌రిగేది ఇదే..!

  • ముల్లాన్‌పూర్ వేదిక‌గా క్వాలిఫయర్-1
  • ఈ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్న‌ పీబీకేఎస్‌, ఆర్‌సీబీ 
  • ఒక‌వేళ వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్ ర‌ద్దైతే.. లీగ్ స్టేజీలో టేబుల్ టాప‌ర్‌గా ఉన్న పీబీకేఎస్ ఫైనల్‌కు  
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జ‌ర‌గనున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ముల్లాన్‌పూర్ వేదిక‌గా క్వాలిఫయర్-1కి రంగం సిద్ధమైంది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌-2 స్థానాల్లో నిలిచిన పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు(ఆర్‌సీబీ) తలపడనున్నాయి. రెండు జట్లు 14 మ్యాచ్‌ల్లో 19 పాయింట్లతో లీగ్ ద‌శ‌ను ముగించాయి. అయితే, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది.

ఇవాళ జ‌రిగే క్వాలిఫ‌య‌ర్‌-1లో పోటీ ప‌డ‌నున్నాయి. ఇందులో గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కి వెళుతుంది. అయితే, ఒక‌వేళ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే? పైగా క్వాలిఫయర్-1కి రిజర్వ్ డే కూడా లేదు. కాబట్టి ముల్లాన్‌పూర్‌లో వర్షం వ‌ల్ల మ్యాచ్ ఆగిపోతే ఏమి జరుగుతుంది?

ఐపీఎల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం లీగ్ స్టేజీలో టేబుల్ టాప‌ర్‌గా ఉన్న పీబీకేఎస్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక‌, ఆర్‌సీబీ... ముంబ‌యి ఇండియ‌న్స్  (ఎంఐ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరిగే ఎలిమినేటర్ విజేతతో తలపడుతుంది. ఇందులో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్లో పంజాబ్‌తో ఆడుతుంది. 

ఇక‌, 2014 తర్వాత తొలిసారిగా ప్లే-ఆఫ్‌లకు చేరిన పంజాబ్ కింగ్స్ జట్టు ఎలాగైనా ఈసారి క‌ప్పు గెలవాల‌నే క‌సితో ఉంది. అటు ఆర్‌సీబీ కూడా తమ‌కు అంద‌ని ద్రాక్ష‌గా మిగిలిన ఐపీఎల్ టైటిల్‌ను ఈ ఏడాది గెలిచి తీరుతామ‌ని చెబుతోంది. 


More Telugu News