Elon Musk: ట్రంప్‌కు షాక్.. కీలక పదవికి ఎలాన్ మస్క్ గుడ్‌బై!

Elon Musk Steps Down from Department of Government Efficiency

  • డోజ్ పదవికి మస్క్ రాజీనామా
  •  తన షెడ్యూల్ ముగిసిందన్న మస్క్ 
  •  అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు 
  •  ఎక్స్‌ ద్వారా అధికారిక ప్రకటన

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వంలో తాను నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్) ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు.

అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించే కాలపరిమితి ముగిసిందని మస్క్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వంలో అనవసరపు ఖర్చులను తగ్గించే బృహత్తర కార్యక్రమంలో తనకు అవకాశం కల్పించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. డోజ్ విభాగం భవిష్యత్తులో మరింత పటిష్టంగా పనిచేసి, తన లక్ష్యాలను చేరుకుంటుందని మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు.

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ కార్యకలాపాల్లో సమూలమైన మార్పులు తీసుకురావడం, ప్రభుత్వ విభాగాల్లో జరుగుతున్న వృథా ఖర్చులను అరికట్టడం ప్రధాన లక్ష్యాలుగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్)ని ఏర్పాటు చేశారు. దీనికి మస్క్‌ను చైర్మన్‌గా నియమించింది. మస్క్ నేతృత్వంలో ఈ విభాగం ప్రభుత్వ వ్యయ నియంత్రణకు పలు చర్యలు చేపట్టింది.

Elon Musk
Donald Trump
Department of Government Efficiency
DOZE
Tesla
Government Waste Reduction
US Government
Government Efficiency
Elon Musk Resignation
  • Loading...

More Telugu News