Balaji Govindappa: ఏపీ లిక్కర్ స్కామ్... బాలాజీ గోవిందప్పకు కోర్టులో భారీ ఉపశమనం

Balaji Govindappa Granted Special Facilities in Jail
  • మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బాలాజీకి జైలులో సౌకర్యాలు
  • వైద్యుల నివేదిక పరిశీలించి అనుమతించిన ఏసీబీ కోర్టు
  • ఇనుప మంచం, ఫోమ్ బెడ్, కుర్చీ అందించిన కుటుంబ సభ్యులు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైలులో ఉన్న బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు ఊరట కల్పించింది. అనారోగ్య కారణాల రీత్యా తనకు జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆయన చేసిన విన్నపాన్ని కోర్టు అంగీకరించింది. వైద్యులు సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం, ఇనుప మంచం, ఫోమ్ బెడ్, కుషన్ పిల్లో, కుర్చీ వంటివి ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఈ వస్తువులను జైలులో అందజేశారు.

మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి నిందితులను సిట్ కస్టడీకి అప్పగించడంపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. సోమవారం ఈ పిటిషన్‌పై ప్రభుత్వం, సిట్ తరఫు న్యాయవాదులతో పాటు నిందితుల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసి, మే 29న వెలువరిస్తామని స్పష్టం చేసింది.
Balaji Govindappa
AP Liquor Scam
Andhra Pradesh Liquor Case
ACB Court
SIT Investigation
Liquor Scandal
Special Facilities
Court Order
AP News

More Telugu News