Ghulam Nabi Azad: సౌదీలో పర్యటిస్తున్న ఎంపీల బృందంలో ఆజాద్ కు అస్వస్థత

Ghulam Nabi Azad falls ill in Saudi Arabia
--
ఉగ్రవాదానికి దన్నుగా నిలుస్తున్న పాకిస్థాన్ ను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు భారత ఎంపీల బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సౌదీలో పర్యటిస్తున్న ఎంపీల బృందంలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను రియాజ్ లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సౌదీ పర్యటనకు వెళ్లిన ఎంపీల బృందానికి బీజేపీ ఎంపీ జయంత్ పాండా నేతృత్వం వహిస్తున్నారు. 

ఎంపీ ఆజాద్ అస్వస్థతపై పాండా మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ గులాం నబీ ఆజాద్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వివరించారు. కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు చెప్పారన్నారు. బహ్రెయిన్, కువైట్ పర్యటనలో ఆయన ఎంతో కృషి చేశారని పాండా చెప్పారు. అయితే, సౌదీ అలాగే అల్జీరియాలలో నిర్వహించబోయే సమావేశాలకు ఆజాద్ హాజరుకాలేరని ఎంపీ పాండా పేర్కొన్నారు.
Ghulam Nabi Azad
Saudi Arabia
Indian Delegation
Jayant Panda
Riyadh Hospital
Health Update
Bahrain
Kuwait
Algeria
Parliament

More Telugu News