Tourist Family Movie: సెలబ్రిటీలు మెచ్చిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ... ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే...!

Tourist Family Movie OTT Release Date on Jio Hotstar
  • శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అభిషాన్ జీవింత్ తెరకెక్కించిన కామెడీ డ్రామా మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ
  • ఈ మూవీపై ప్రశంసలు కురిపించిన సెలబ్రిటీలు రాజమౌళి, రజనీకాంత్, సూర్య, శివకార్తికేయన్, నాని తదితరులు
  • ఓటీటీ విడుదలకు మూహూర్తం ఖరారు 
  • జియో హాట్‌స్టార్‌లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ 
శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అభిషాన్ జీవింత్ రూపొందించిన కామెడీ డ్రామా చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. మే 1న విడుదలైన ఈ సినిమాను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇటీవల సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

"అద్భుతమైన సినిమా చూశాను. హృదయాన్ని కదిలించింది, కడుపుబ్బా నవ్వించింది. అభిషాన్ చక్కగా రచించి, దర్శకత్వం వహించారు. ఈ మధ్యకాలంలో చూసిన ఉత్తమ చిత్రాల్లో ఇది ఒకటి. తప్పకుండా చూడండి" అంటూ రాజమౌళి కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం గురించి పోస్ట్ చేశారు.

కోలీవుడ్ హీరోలు రజనీకాంత్, సూర్య, శివకార్తికేయన్, టాలీవుడ్ హీరో నాని కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దాదాపు రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ.75 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.

ఈ సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. జూన్ 2 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. 
Tourist Family Movie
Sasikumar
Simran
Abhishan Jeevanth
Rajamouli
OTT Release
Jio Hotstar
Telugu Movie Review
Kollywood
Tollywood

More Telugu News