Visakhapatnam: విశాఖ నుంచి అబుదాబికి విమాన సర్వీసు

Visakhapatnam to Abu Dhabi Flight Service Starts June 13
  • జూన్ 13 నుంచి విశాఖ - అబుదాబీ మధ్య సర్వీసు
  • సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో అబుదాబీ సర్వీసు
  • విశాఖ - భువనేశ్వర్ మధ్య విమాన సర్వీసుకు ఒడిశా సర్కార్ సహకారం 
ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయంగా ప్రయాణించే వారికి విమానయాన సంస్థలు శుభవార్తను అందించాయి. విశాఖపట్నం నుండి అబుదాబీకి అంతర్జాతీయ విమాన సర్వీసులు జూన్ 13 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సర్వీసు వారానికి నాలుగు రోజులు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 8.20 గంటలకు విమానం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 9.50 గంటలకు అబుదాబీకి బయలుదేరుతుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుండి అబుదాబీకి ఇప్పటి వరకు ప్రత్యక్ష విమాన సర్వీసులు లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రయాణికులు హైదరాబాద్, బెంగళూరు లేదా చెన్నై మీదుగా అబుదాబీకి వెళ్లవలసి వచ్చేది.

అలాగే, దేశీయంగా విశాఖ - భువనేశ్వర్ మధ్య విమాన సర్వీసును నడిపేందుకు ఒడిశా ప్రభుత్వం సహకారం అందించింది. ఈ సర్వీసు జూన్ 15 నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖకు చేరుకుని, తిరిగి 2.25 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరుతుంది. 
Visakhapatnam
Visakhapatnam Abu Dhabi flight
Abu Dhabi flight
Andhra Pradesh flights
International flights
Visakhapatnam airport
Bhubaneswar flight
Odisha government
Flight services

More Telugu News