పాకిస్థాన్ ఆటగాడి తల పొగరు... వీడియో చూడండి!
- జూనియర్ డెవిస్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 2-0 తేడాతో విజయం
- సింగిల్స్‌లో ప్రకాశ్ శరణ్, తావిష్ పహ్వా అద్భుత విజయాలు
- మ్యాచ్ తర్వాత పాక్ ఆటగాడి దురుసుతునం
- షేక్‌హ్యాండ్ ఇచ్చే సమయంలో అగౌరవంగా ప్రవర్తించిన పాక్ ప్లేయర్
వివరాల్లోకి వెళితే, భారత ఆటగాళ్లు ప్రకాశ్ శరణ్, తావిష్ పహ్వా తమ తమ సింగిల్స్ మ్యాచ్‌లలో సూపర్ టైబ్రేక్‌ల ద్వారా గెలిచి జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు. దీంతో భారత్ 2-0 తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.
అయితే, మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన షేక్‌హ్యాండ్ సందర్భంగా ఒక పాకిస్థానీ ఆటగాడు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. మంగళవారం బయటకు వచ్చిన వీడియోలో, పాకిస్థాన్ ఆటగాడు మొదట షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయి, ఆ తర్వాత రెండో ప్రయత్నంలో భారత ఆటగాడి చేతిని తాకి, వెంటనే అగౌరవంగా వెనక్కి లాక్కున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ సంఘటన జరిగినప్పుడు భారత ఆటగాడు మాత్రం సంయమనం పాటిస్తూ, ఎలాంటి ఆవేశానికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండటం గమనార్హం.
ఈ షేక్‌హ్యాండ్ వివాదం భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.