బాబా బైద్యనాథ్ ధామ్‌ను సంద‌ర్శించిన‌ 'కన్న‌ప్ప' చిత్రబృందం

  • జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానున్న ‘కన్నప్ప’  
  • ఇప్పటికే జోరుగా ప్రచార‌ కార్యక్రమాలు
  • దేశంలోని ప్ర‌ముఖ శివాల‌యాల‌ను సంద‌ర్శిస్తూ ప్ర‌మోష‌న్స్
  • తాజాగా ఝార్ఖండ్‌లోని బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆల‌యాన్ని సంద‌ర్శించిన చిత్రంయూనిట్‌
మంచు మోహ‌న్ బాబు, మంచు విష్ణుల‌ డ్రీమ్ ప్రాజెక్ట్  ‘కన్నప్ప’. జూన్ 27న ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర‌బృందం జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే విష్ణు అమెరికాలో కూడా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు పూర్తి చేశారు. ఇప్పుడు దేశంలోని ప్ర‌ముఖ శివాల‌యాల‌ను సంద‌ర్శిస్తూ ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. 

ఇందులో భాగంగా ‘కన్నప్ప’ చిత్రబృందం తాజాగా బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆల‌యాన్ని సంద‌ర్శించింది. ఇది ఝార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ జిల్లాలో ఉంది. ఇది శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. తాము బాబా బైద్యనాథ్ ధామ్‌ను సంద‌ర్శించిన‌ ఫొటోల‌ను హీరో విష్ణు త‌న ఎక్స్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. 

ఇక‌, బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ‘కన్నప్ప’ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్ర‌లో కనిపించనున్నారు. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ ఇత‌ర‌ కీలక పాత్రలు పోషించారు. 


More Telugu News