Raghu Rama Krishna Raju: ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది: రఘురామకృష్ణరాజు

- ప్రేక్షకులను ఆకట్టుకున్న 'అనగనగా' చిత్రం
- ప్రధాన పాత్ర పోషించిన సుమంత్
- హృదయాన్ని హత్తుకునేలా సినిమాను నిర్మించారన్న రఘురామ
సుమంత్ ప్రధాన పాత్రను పోషించిన 'అనగనగా' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ సక్సెస్ ను సాధించింది. కార్పొరేట్ విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ తో పాటు కాజల్ చౌదరి, మాస్టర్ విహర్ష్, శ్రీనివాస్ అవసరాల, అనుహాసన్ తదితరులు నటించారు.
తాజాగా ఈ చిత్రంపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశంసలు కురిపించారు. సున్నితమైన అంశాలను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలలో పిల్లల ఆత్మహత్యల అంశాన్ని స్పృశిస్తూ, ఎలాంటి అసభ్యత లేకుండా చిత్రాన్ని రూపొందించారని కితాబునిచ్చారు. కఠినంగా ఉండేవాళ్లు సైతం ఈ సినిమా చూస్తూ కంటతడి పెట్టుకుంటారని చెప్పారు. మంచి కథాంశంతో ప్రతిఒక్కరూ ఆలోచించేలా సినిమాను తెరకెక్కించారని ప్రశంసించారు.
