Vijay Deverakonda: యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌కు గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Gifts Young Music Director Anirudh
  • తన రౌడీ బ్రాండ్ షీ టర్ట్స్, షటిల్ బ్యాట్‌ను బహుమతిగా అందజేసిన విజయ్ దేవరకొండ
  • ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సితార ఎంటర్‌టైన్‌‌మెంట్స్ 
  • జులై 4న విడుదల కానున్న విజయ్ దేవరకొండ తాజా మూవీ 'కింగ్ డమ్'
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు హీరో విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేక బహుమతిని అందజేశారు. తన రౌడీ బ్రాండ్ షీ టర్ట్స్ దుస్తులను, తాను ఉపయోగించిన షటిల్ బ్యాట్‌ను బహుమతిగా విజయ్ అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా పంచుకుంది.

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కింగ్ డమ్'కు అనిరుధ్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జులై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 
Vijay Deverakonda
Anirudh Ravichander
King Dom
Gowtam Tinnanuri
Sithara Entertainments
Telugu Movie
Music Director
Rowdy Brand
Shuttle Bat
Movie Release

More Telugu News