పంజాబ్ కింగ్స్ తో ముంబయి ఇండియన్స్ ఢీ... గెలిస్తే పంజాబ్ కు టాప్ ప్లేస్
- ముగింపు దశకు చేరిన ఐపీఎల్ లీగ్ దశ
- నేడు జైపూర్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
ప్రస్తుతం పంజాబ్ టీమ్ం 13 మ్యాచ్ ల్లో 8 విజయాలు సాధించి 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ గెలిస్తే 19 పాయింట్లతో టాప్ కు చేరుకుంటుంది. మరో వైపు ముంబయి ఇండియన్స్ కూడా ఇప్పటికే ప్లే ఆఫ్ చేరుకుంది. ఆ జట్టు ఈ మ్యాచ్ లో గెలిస్తే రెండో స్థానానికి ఎగబాకుతుంది. ముంబయి టీమ్ 13 మ్యాచ్ ల్లో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.