పిల్లల కళ్లేదుటే తల్లి ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి

  • పొరబాటున ఒక బోగీ బదులు మరో బోగీ ఎక్కి
  • పిల్లలను బోగీ ఎక్కించి తల్లి ఎక్కుతుండగా ప్రమాదం
  • చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఘటన 
పిల్లల కళ్లెదుటే ఓ కన్నతల్లి ప్రమాదవశాత్తు రైలు కింద పడి దుర్మరణం పాలైన ఘటన చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన మట్టల వెంకటేశ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ లింగంపల్లి హెచ్ఎంటీ టౌన్ షిప్ చింతల్ చంద్రానగర్‌లో నివాసముంటున్నారు.

సెలవుల్లో పిల్లలతో అత్తింటికి వెళ్లి వస్తానని భార్య శ్వేత చెప్పడంతో వెంకటేశ్ అంగీకరించారు. ఆదివారం శ్వేత, పిల్లలను లింగంపల్లి స్టేషన్లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కించారు. అయితే డీ8 బోగీ ఎక్కాల్సిన వారు పొరబాటున డీ3లో ఎక్కారు. ఇతర ప్రయాణికులు వచ్చి తమ సీట్లని చెప్పడంతో ఆమె పొరబాటును గుర్తించారు. బోగీలో రద్దీ ఉండటంతో చర్లపల్లి స్టేషన్‌లో రైలు దిగి ఇద్దరు పిల్లలతోపాటు డీ8 బోగీ వద్దకు చేరుకున్నారు.

పిల్లలను బోగీలోకి ఎక్కించిన తర్వాత శ్వేత రైలు ఎక్కుతుండగా రైలు కదలడంతో ప్రమాదవశాత్తు కాలు జారి రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో పడి మృతి చెందారు. తమ కళ్లెదుటే తల్లి మృత్యువాత పడటంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తల్లడిల్లిపోయారు. 


More Telugu News