Toll Policy: కొత్త టోల్ పాలసీ తీసుకువస్తున్న కేంద్రం

New Toll Policy Coming Soon from Central Government
  • కొత్త టోల్ పాలసీలో రెండు రకాల చెల్లింపు విధానాలు
  • ఒక్కసారి రూ.3వేల చెల్లింపుతో ఏడాది మొత్తం ఫ్రీగా టోల్ పాస్ చేసే అవకాశం
  • వంద కిలోమీటర్లకు రూ.50లు ఫిక్స్డ్ అమౌంట్ చెల్లింపు విధానం కూడా..  
జాతీయ రహదారులపై తరచూ ప్రయాణాలు చేస్తూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్‌లతో ఇబ్బందులు పడే వాహనదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఖర్చు తగ్గించేందుకు ఫాస్ట్ ట్యాగ్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

తాజా ప్రతిపాదనలో భాగంగా, వాహనదారులు త్వరలో రూ.3 వేల వార్షిక రుసుము చెల్లించే అవకాశం రావచ్చు. తద్వారా వారు ఏడాది పొడవునా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేలపై స్వేచ్ఛగా, పరిమితులు లేకుండా ప్రయాణించవచ్చు. కొత్తగా తీసుకురానున్న ఈ పథకంలో రెండు చెల్లింపు విధానాలను తీసుకురాబోతున్నారు. ఇందులో మొదటిది వార్షిక పాస్. దీనికి ప్రతి సంవత్సరం రూ.3 వేల ఫ్లాట్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది వినియోగదారులకు టోల్ రోడ్లపై అపరిమిత ప్రయాణాన్ని అందిస్తుంది.

రెండవది దూరాన్ని బట్టి పాస్ తీసుకునే సౌకర్యం. ఈ పథకం కింద వాహనదారులు వంద కిలోమీటర్లకు రూ.50లు నిర్ణీత నగదు చెల్లిస్తారు. దీనికి అదనపు ధ్రువపత్రాలు కూడా ఏమీ అవసరం లేదు. 
Toll Policy
National Highways
FASTag
Toll Tax
Annual Pass
Distance Based Pass
Road Travel
Highway Tolls
Expressways
India

More Telugu News