Rana Daggubati: 'మిరాయ్' ట్రైలర్ కట్ చూశాను... రాకింగ్: రానా దగ్గుబాటి

Rana Daggubati Reviews Mirai Trailer as Rocking
  • తేజ సజ్జ, మంచు మనోజ్ నటిస్తున్న 'మిరాయ్'
  • సినిమా ట్రైలర్‌ కట్ పై రానా నుంచి అదిరిపోయే రెస్పాన్స్
  • ఇటీవలి కాలంలో ఇదే అత్యంత కూల్ ట్రైలర్ అని కితాబు
  • దర్శకుడు కార్తీక్ పనితనం అద్భుతమంటూ ప్రశంస
  • సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడి
యంగ్ హీరో తేజ సజ్జ, విలక్షణ నటుడు మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మిరాయ్'. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ కట్ ను వీక్షించిన టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి తన అనుభూతిని పంచుకుంటూ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

'మిరాయ్' ట్రైలర్‌ను చూసిన రానా, "తేజ సజ్జ, మంచు మనోజ్‌ల 'మిరాయ్' ట్రైలర్ ఇప్పుడే చూశాను. చాలా కాలం తర్వాత నేను చూసిన అత్యంత ఆకట్టుకునే ట్రైలర్ ఇది" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రైలర్‌లోని అంశాలు, చిత్రీకరణ తనకు ఎంతగానో నచ్చాయని తెలిపారు.
ముఖ్యంగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, "దర్శకుడు కార్తీక్ అద్భుతంగా తీశారు!!" అని కొనియాడారు. ఆయన దర్శకత్వ ప్రతిభ ట్రైలర్‌లోనే స్పష్టంగా కనిపిస్తోందని, సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసిందని పేర్కొన్నారు. "సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను!!" అని రానా తన ఉత్సుకతను పంచుకున్నారు.


Rana Daggubati
Mirai movie
Teja Sajja
Manchu Manoj
Karthik Ghattamaneni
Telugu movie trailer
Telugu cinema
Mirai trailer review
Tollywood
Movie review

More Telugu News