Preity Zinta: ప్రీతి జింటాతో డుప్లెసిస్ స్టన్నింగ్ ఫొటో... నెటిజన్లు ఏమంటున్నారో చూడండి!

Preity Zinta and Faf du Plessis Stunning Photo Goes Viral
  • వైరల్ ఫోటో: ప్రీతితో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు
  • ఇద్దరూ కలిసి సినిమా చేయాలన్న ఫ్యాన్
  • "అలాగే కానివ్వండి" అంటూ డుప్లెసిస్ రిప్లయ్
ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటాతో కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరూ శనివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా పక్కపక్కనే నిల్చున్న దృశ్యం అభిమానులను ఆకట్టుకుంది. డుప్లెసిస్ చేతులు కట్టుకుని హుందాగా నిల్చుని ఉండగా, ప్రీతి జింటా ముఖంపై దోబూచులాడే ముంగురులతో ముగ్ధమనోహరంగా దర్శనమిచ్చారు.

ఓ సోషల్ మీడియా యూజర్ వీరిద్దరూ కలిసి బాలీవుడ్ సినిమాలో నటించాలని సూచించాడు. "దయచేసి ఎవరో ఒకరు ఫాఫ్ డుప్లెసిస్, ప్రీతి జింటాలను ఒక సినిమాలో నటింపజేయండి. అతను యాక్షన్ హీరోలా ఉన్నాడు. ఆమె వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా తయారవుతున్నారు. వీరిద్దరినీ ఒక స్పోర్ట్స్ డ్రామాలో లేదా రాయల్ రొమాన్స్‌లో చూడాలనుంది... ఈ విజువల్ పర్‌ఫెక్షన్‌ను వృధా చేయకండి!" అని అభిమాని పోస్ట్ చేశాడు.

ఈ సూచనపై ఫాఫ్ డుప్లెసిస్ తనదైన శైలిలో సరదాగా స్పందించాడు. "అలాగే కానివ్వండి (Make it happen)" అంటూ ట్వీట్ చేశాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Preity Zinta
Faf du Plessis
Punjab Kings
Delhi Capitals
IPL
Bollywood
Cricket
Social Media
Viral Photo
Sports Drama

More Telugu News