Fire Tamil Movie: జోరు తగ్గని తమిళ రొమాంటిక్ థ్రిల్లర్!

Fire Movie Update
  • తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ గా 'ఫైర్'
  • ఫిబ్రవరిలో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఇంట్రెస్టింగ్ గా అనిపించే ట్రీట్మెంట్ 
  • అమెజాన్ ప్రైమ్ లోను అందుబాటులోకి

వారం తిరిగి వస్తుండగానే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి అనేక జోనర్ల నుంచి సినిమాలు అడుగుపెడుతూ ఉంటాయి. అయితే ఒక్కోసారి అంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కనిపించనప్పుడు, కొంత వెనక్కి వెళ్లి సెర్చ్ చేసేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటివారు ఇప్పటికే చూడకపోయి ఉంటే, అమెజాన్ ప్రైమ్ లోని 'ఫైర్' తమిళ సినిమాపై ఒక లుక్ వేయవచ్చు.

రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా ఇది. బాలాజీ మురుగదాస్ .. చాందిని తమిళరసన్ .. రచిత మహాలక్ష్మి .. సాక్షి అగర్వాల్ .. గాయత్రి షాన్ .. సతీశ్ కుమార్ ప్రధానమైన పాత్రలను పోషించారు. 2025 ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ - టెంట్ కొట్టాలో అందుబాటులో ఉంది. దర్శక నిర్మాతగా వ్యవహరించిన సతీశ్ కుమార్, ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ శరవణన్ గా కనిపిస్తాడు. 

కాశీ (బాలాజీ మురుగదాస్) ఫిజియో థెరపిస్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. హఠాత్తుగా అతను కనిపించకపోవడంతో, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేస్తారు. పోలీస్ ఆఫీసర్ శరవణన్ తన టీమ్ తో రంగంలోకి దిగుతాడు. అతను తన ఇన్వెస్టిగేషన్ ను కాశీ క్లినిక్ నుంచి మొదలుపెడతాడు. ఆ విచారణలో కాశీ గురించి ఆయనకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? కాశీ కనిపించకుండా పోవడానికి కారకులు ఎవరు? అనేది మిగతా కథ.

కథ కొత్తది కాకపోయినా ట్రీట్మెంట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ వైపు నుంచి కథ రివిల్ అవుతూ వెడుతూ ఉంటుంది గనుక, ఆడియన్స్ ఆసక్తి తగ్గకుండా కథ వెంట పరుగులు పెడుతూ ఉంటారు. ఇక రొమాంటిక్ టచ్ కూడా ఉండటం ఈ కథకి మరింత కలిసొచ్చిన అంశం. రొమాన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ కావడం వల్లనే ఈ సినిమా జోరు ఇంకా తగ్గలేదేమోనని అనిపిస్తుంది.  

Fire Tamil Movie
Balaji Murugadoss
Chandini Tamilarasan
Romantic thriller
Tamil cinema
Crime thriller movie
Amazon Prime
OTT movies
Tamil movies 2024
Satish Kumar

More Telugu News