Shubman Gill: మోదీ స్టేడియంలో గుజరాత్ తో లక్నో ఢీ... టాస్ గెలిచిన టైటాన్స్

Gujarat Titans win toss against Lucknow at Modi Stadium
  • అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ × లక్నో సూపర్ జెయింట్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
  • ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్ టైటాన్స్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగనున్న ఈ పోరులో, గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో, రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ దశకు చేరుకోగా, లక్నో ఇంతకుముందే ఎలిమినేట్ అయింది. దాంతో నేటి మ్యాచ్ కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. అయితే, పాయింట్ల పట్టికలో తన నెంబర్ వన్ స్థానాన్ని మరింత పదిలపరుచుకోవాలంటే గుజరాత్ కు ఈ మ్యాచ్ లో గెలుపు తప్పనిసరి.

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.

లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాశ్ దీప్, అవేష్ ఖాన్, విలియం ఓరూర్కే.
Shubman Gill
Gujarat Titans
Lucknow Super Giants
Narendra Modi Stadium
IPL 2024
Indian Premier League
Cricket
Rishabh Pant
Match Preview
Ahmedabad

More Telugu News