పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా

  • రహదారులు, ప్రభుత్వ స్థలాల కబ్జాపై హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదులు
  • పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు 
  • భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు షురూ
  • రహదారులు, ప్రభుత్వ స్థలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ లకు ఫిర్యాదులు
అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండీఏ మరోసారి కొరడా ఝుళిపించింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హెచ్‌ఎండీఏ కూల్చివేసింది. రహదారులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా స్థానిక మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు ఇటీవల హెచ్‌ఎండీఏ కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన ఆయన స్వయంగా స్థలాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన ఆదేశాలతో గురువారం వేకువజాము నుంచే ఆక్రమణల కూల్చివేతలను హెచ్‌ఎండీఏ అధికారులు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్లు 1, 10, 11లలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. 


More Telugu News